దేవుడు ఎక్కడ,ఎలా వుంటాడు! ఏ దేవుడు గొప్ప ,ఏ మతం,ఏ మత గ్రంధం గొప్ప ?
అసలు దేవుడి పేరుమీద జరిగినన్ని యుద్దాలు,హత్యలు,నానాగొడవ ఈ ప్రపంచంలొ మరేవిషయం మీదా జరగలెదనుకుంటా. వేలసంవత్సరాల క్రితం రాసిన గ్రంథాలే దేవుడికి సమాదానమా.నాకెందుకో ఒకోసారి మూర్ఖంగా వాటిని పట్టుకొని వేళ్ళాడు తున్నామా అనిపిస్తుంది. అన్నీ ఆఆ అవతారాలు పూర్తయ్ న కొన్ని సంవత్సరాల తరువాత రాసినవే. వేదాల విషయంలో కొన్ని విని చెప్పినవంటారు.ఒక వేళ నిజమనుకున్నా వందల సంవత్సరాలు అదీ హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగిన పరాయి పాలనలో మగ్గిన తరువాత వేదాల్లో నిజమెంత అబద్దమెంత స్వార్థమెంత జొప్పించినదెంతో తెలియని పరిస్థితి. మనిషే వ్రాసిన ఈపవిత్ర గ్రంథాలపై అనేక విమర్శలున్నాయ్. దానికి తోడు మా గ్రంథం గొప్పదని చెప్పుకొనే క్రమంలో ఇతర మత గ్రంథాలని విమర్శిస్తూ బొచ్చడు పుస్తకాలు, బ్లాగులు రెడీగా ఉన్నాయ్. ఆత్మవిమర్శ కంటే పక్కవాణ్ని విమర్శించడమే బాగా టేస్టీగా ఉంటుంది కదా. నా ఉద్దేశం ఏ గ్రంథమైనా సరే వాటి నుంచి కాలం చెల్లిన విషయాలు పక్కన పెట్టి మంచిని, అందరికి అంగీకారంమైన విషయాలు తీసుకునే అవగాహన రావాలి.నాకు తెలిసినంతలో అన్నీ మత గ్రంథాలు దేవుడు రూపరహితుడు,సర్వాంతర్యామి అని చెప్తున్నాయి. అసలు దేవుడి కి మతమేంటో రాజకీయపార్టీల్లాగ. ఒక వేళ దేవుడే కనక ఫలానా మతం లోకి వస్తేనే లేదా ఫలానా కానుకలు సమర్పిస్తేనే లేదా ఫలానా పూజలు చేస్తేనే కరుణిస్తానంటే వాడు దేవుడేలా అవుతాడు.

మానవ సమాజంలో- అసలు (Original) కు ప్రతిగా నఖలు (Duplicate) ను తయారు చేయటం అనే ప్రక్రియ అనాదిగా సంభవిసున్నదే కదా! దానికి ధార్మిక వ్యవస్థా అతీతం కాలేకపోయింది! అందులో భాగంగానే నఖలు (Duplicate) ధర్మము ఒకటి ఏర్పడింది. ఆ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించటానికి ఈ క్రింది విషయాలను ప్రస్తావితున్నాను. దయచేసి గమనించగలరు.
రిప్లయితొలగించండి1. మనిషి వ్యక్తిగత జీవితంలో ‘నైతికత’ను మరియు అతని సామూహిక జీవితంలో ‘మానవత’ను ఉద్దీపింప జేసే ‘సశాస్త్రీయమైన ఆలోచన-ఆచరణ’ విధానాలు మన ధర్మశాస్త్రాలైన గీతా-బైబిల్-ఖురాన్ లలో ఉన్నాయి.
2. హిందూ-ముస్లిం-క్రైస్తవ ధార్మిక వ్యవస్థలు అధికశాతం వంచకులైన పండిత వర్గపు దురాక్రమణలో ఉన్నాఉన్నాయి.
3. లోక కళ్యాణానికి ఉపయోగ పడే, ‘సశాస్త్రీయ’ మరియు ‘విశ్వజనీన’ సిద్ధాంతాలను ప్రబోధించే మన ధర్మశాస్త్రాలైన గీతా-బైబిల్-ఖురాన్ లను ప్రజల ముందు కేవలం ప్రదర్శిస్తూ, ‘శాస్త్ర విరుద్ధమైన’ మరియు ‘సంకుచితమైన’ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు.
4. ఈ దుర్మార్గానికి అన్ని మత వర్గావర్గాలకు చెందిన అధికశాతం పండిత వర్గాలు పాల్పడుతున్నాన్నారు.
ఈనాటి అధికశాతం హిందూ- క్రైతవ-ముస్లిం పండితులు బోధిస్తున్న సిద్ధాంతాలకు గీతా-బైబిలు-ఖురాను గ్రంధాలు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతాలకు ఏ మాత్రం పొంతన లేవు.
గమనిక: విషయ స్పష్టత కొరకు- ధర్మశాస్త్రాలలో మరుగున పడి ఉన్న (Hidden) ధర్మమమును ‘శాస్త్రాల ప్రతిపాదిత ధర్మం’ (Scriptures produced religion) గా గుర్తించాలి.
జనసామాన్యంలో సర్వసామాన్యం (Popular) అయి ఉన్న ధర్మాన్ని ‘శాస్త్రుల ప్రబోధిత ధర్మం’ (Preachers propagated religion) అని వ్యవహరించాలి.
‘శాస్త్రాల ప్రతిపాదిత ధర్మం’ (Scriptures produced religion) ను అనుసరిచటం వలన బాహ్యంలో ధార్మిక వేషాధారణ ఉండనప్పటికీ వారి జీవితాలలో ‘సత్ప్రవర్తన’ మటుకు ఉంటుంది! ఎందుకంటే- ధర్మశాస్త్రాలు ఒక్క ‘సత్ప్రవర్తన’కు తప్ప ‘వేషాధారణ’కు ఎలాంటి ప్రాధాన్యతనూ ఇవ్వవు.
ఈ ‘శాస్త్రుల ప్రబోధిత ధర్మం’ (Preachers propagated religion) ను అనుసరిచటం వలన బాహ్యంలో ధార్మిక ‘వేషాధారణ’ మాత్రం ఉంటుంది. కాని వారి జీవితాలలో ‘సత్ప్రవర్తన’ మాత్రం ఉండదు! ఎందుకంటే- శాస్త్రులు ఒక్క ‘వేషాధారణ’ తప్ప ‘సత్ప్రవర్తన’కు ఎలాంటి ప్రాధాన్యతనూ ఇవ్వవు.
మానవాళి పట్ల ఏ మాత్రం దయా జాలి ఉన్నా మనమందరం కలసి ‘శాస్త్రుల ప్రబోధిత ధర్మం’ (ఫ్రేచెర్స్ ప్రొపగతెద్ రెలిగిఒన్) ను తొలగించి, ‘శాస్త్రాల ప్రతిపాదిత ధర్మం’ (Scriptures produced religion) ను సర్వసామాన్యం (ఫొపులర్) చేయాలి. ఇలా చేయటం ద్వారా తప్ప మరే విధంగానూ సమాజ సంస్కరణ ఎన్నటికీ సాధ్యం కాదు! కాబోదు!!
మీ అభి ప్రాయము ‘శాస్త్రుల ప్రబోధిత ధర్మం’ (Preachers propagated religion) ప్రకారమైతే పూర్తిగా వాస్తవం. కాని ‘శాస్త్రాల ప్రతిపాదిత ధర్మం’ (Scriptures produced religion) ప్రకారమైతే వాస్తవం కాదు!
మీ స్పందనలు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి"మీ అభి ప్రాయము ‘శాస్త్రుల ప్రబోధిత ధర్మం’ (Preachers propagated religion) ప్రకారమైతే పూర్తిగా వాస్తవం. కాని ‘శాస్త్రాల ప్రతిపాదిత ధర్మం’(Scriptures produced religion) ప్రకారమైతే వాస్తవం కాదు" అర్ధం కాలేదు వివరించండి
గౌరవనీయులైన కుమార్ గారికి నమస్కారాలు. విషయాన్ని మీకు వివరంగా చెప్పలేక పోయినందుకు క్షమించాలి. నేను చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే- వేదోపనిషత్తులు వాటి సారాంశముగా ప్రబోధించబడిన భగవద్గీతా-బైబిలు-ఖురాను గ్రంధాలు ప్రతిపాదించే ధర్మం మానవ జీవన విధానము సశాస్త్రీయంగానూ, సార్వజనీనంగాను, సార్వకాలికంగాను ఉంది. ఇంకా దాని ఆలోచన-ఆచరణ విధానాలను యథాతథంగా అవలంబిస్తే వ్యక్తులలో నైతికత, మానవత, ఇక్యత వంటి విలువలు పెరిగి కుల-మత, వర్ణ-వర్గ భేదభావాలు సమసి, వ్యక్తుల, వర్గాల మధ్య ప్రేమ త్యాగం సానుభూతి వంటి ఉత్తమ స్పందనలు ఏర్పడతాయనటంలో ఎలాంటి సందేహమూ లేదు!
తొలగించండిఅయితే మనుషులలో అంత గొప్ప ఉత్తమ విప్లవాన్ని తేగలిగే ఆ గ్రంధాలనయితే నేటి మన హిందూ-క్రైస్తవ-ముస్లిం వర్గాలకు చెందిన అధికశాతం పండితులు చేత పట్టుకొని వాటి దృక్పథాలను ప్రబోధిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ వారు ప్రబోధించేది మటుకు పైన పేర్కొన్న ఉత్తమ దృక్పథాలకు పూర్తిగా వ్యతిరేకమైన దృక్పథాలను ప్రజలలో ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే- వారి వారి వ్యక్తిగత, వర్గగత ప్రయోజనాలే!
వారి కాల్పనిక తప్పుడు దృక్పథాలను ఆయా మత వర్గాలకు చెందిన సామాన్య ప్రజలు ధర్మగ్రంధాల ప్రబోధనలని భ్రమించి, ఎంతో నిష్టగా ఆచరిస్తున్న కారణంగానే మీరు చెప్పినట్లు మత చరిత్ర అంతా రక్తసిక్తం అయ్యింది!
కనుక మికు నేను సవినయముగా మనవి చేసేది ఏమిటంటే- నేటి వివిధ మతవర్గాలకు చెందిన శాస్త్రులు ప్రచారం చేసే మత ప్రబొధలను వేదోపనిషత్తులు వాటి సారాంశముగా ప్రబోధించబడిన భగవద్గీతా-బైబిలు-ఖురాను గ్రంధాలు ప్రతిపాదించే ధర్మ ప్రబోధలు ఒక్కటే అని భావించ వద్దు అనేదే!
దీనికి ఉదాహరణగా మన వర్ణ వ్యవస్థ వాస్తవికతకు సంబంధించిన ఈ చిన్న వ్యాసాన్ని చదవగలరు. http://www.sakshyammagazine.com/2015/05/blog-post.html