5, జనవరి 2019, శనివారం

(తోక)పత్రికలు/news papers

(తోక)పత్రికలు/news papers
అసలు పత్రికకి తోకకి ఎక్కడన్నా పోలికుందా అని అనుకుంటున్నారా . ఈరెండు పదాలతో టైటిల్ ఏంటి అనుకుంటున్నారా.అవును లేదు కదా.  పత్రిక 'పని' వేరే తోక 'పని' వేరే. ప్రపంచంలో ఎక్కడైనా ఆరెంటి పని వేరే వేరే.  కానీ మన రాష్త్రం(ఆంధ్రప్రదేశ్)లో ఈ రెంటికి  చాలా దగ్గర పోలిక ఉంది. తోక లక్షణం మీకు నేను చెప్పక్కరలేదు అందరికీతెలిసిందే. శరీరం ఎటు తిరిగితే తోక అటు తిరుగుతూ  అప్పుడప్పుడు ఈగలు వాలితే  తోలుతుంటుంది. ప్రధానంగా ఇదే తోక పని. ఇప్పుడు తోకని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న పత్రికల్ని చూడండి. చూసారా మన పత్రికలకి తోక లక్షణాలు ఎలా కనిపిసుతున్నాయో.అరె  రాజకీయ నాయకులు ఎటుతిరిగితే అటు తిరుగుతున్నాయి అనుకుంటున్నారా! అవే కదా తోక లక్షణాలంటే.    

సాక్షి పేపర్ ఉందనుకోండి ఈ పేపర్ తో పెద్దగా చిక్కులేదు  అందరికి తెలిసిందే చంద్రబాబుని బండ బూతులు తిడుతూ రాస్తుందని,  YSRCP గురించి జగన్ గురించి అనుకూలం రాస్తుందని .  ఎందుకంటే పేపర్ వాళ్లదే కాబట్టి. పేపరే వాళ్ళది కాబట్టి ఈ పేపెర్ని తోక అనలేను.

ఈనాడు మరియు అంధ్రజ్యోతి మన రాష్ట్రం లో  అత్యధిక సర్కులేషన్ కలిగిన పత్రికలు. అంతేకాదు వీటిప్రతేకత ఏంటంటే వీటిని ఏ రాజకీయనాయకుడు, ఏ రాజకీయపార్టీ నడపటంలేదు. ఇవి స్వత్రంత పత్రికలు.  కాబట్టి ఇలాంటి పత్రికలు ఎలాంటి పక్షపాత బుద్ధి లేకుండా, ఏ రాజకీయపార్టీని, రాజకీయనాయకుడిని భుజాన వేసుకోకుండా  విశ్శ్లేషణాత్మకంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రజలపక్షాన నిలబడుతూ వార్తలు రాస్తాయని మనం భావించాలి.

అదేoటి  మనరాష్త్రం లో కొన్ని పత్రికలు  చంద్రబాబు  ఎటుతిరిగితే అటుతిరుగుతున్నాయ్ ఆయన నంది అంటే నంది అంటున్నాయి పంది అంటే పంది అంటున్నాయ్. చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పుడు బిజెపి నే దేశానికి దిక్కన్నాయి, మోడీ అంతటివాడు ఈ ప్రపంచంలో లేడన్నాయి,కాంగ్రెస్సే దేశానికి పట్టిన దరిద్రమన్నాయ్, రాహుల్ గాంధీని పప్పుగాడన్నాయి,  స్పెషల్ స్టేటస్ వద్దన్నాయ్ ప్యాకేజి ముద్దన్నాయ్. చంద్రబాబు సడన్ గా  యూటర్న్ తీసుకోగానే దిక్కు తోచని ఈ తోక పత్రికలు కాంగ్రేసే  ఈ దేశానికి దిక్కంటున్నాయ్,రాహుల్ గాంధీ (అప్పుడు పప్పు) అంతటి నాయకుడు  లేడు అంటున్నాయ్,   ఇప్పుడు ప్యాకేజి వద్దంటున్నాయ్ స్పెషల్ స్టేటసే ముద్దంటున్నాయ్.

ఇలా తోక పత్రికల చిత్రాలు చాలాఉన్నాయ్... అన్నట్టు ఈ తోక పత్రికలకి న్యూస్ చానెల్స్ కుడా  ఉన్నాయండోయ్.  ఇహ చుడండి పేపర్ లో రాయుడు చానెల్స్ లో చూపుడు                                  

    

30, డిసెంబర్ 2018, ఆదివారం

శబరిమల

భారత రాజ్యాగం స్త్రీ ని పురుషుడిని ఒకేలా చూస్తుంది అంటేఇద్దరిని ఒకే జండర్  చూస్తుంది. అంట  ఇద్దరిని సెపెరేట్ఈక్వల్ ఇండివిడ్యుయల్స్ గా పరిగణిస్తుంది
మన రాజ్యాగం మతాన్నికులాన్నిఆచారాల్ని ప్రామాణికం గాతీసుకోని రాయబడలేదు. రాజ్యాగం ప్రతి విషయాన్నీశాస్త్రీయంగా,ేతుబద్దంగా,ఆచరణాత్మగంగానే చూస్తుందిఅలానే మన రాజ్యాంగ కర్తలు రాజ్యాంగాన్ని రాశారు

కోర్ట్ తీర్పులు కుడా రాజ్యాంగ బద్ధం గా రాజ్యంగ పరిధి లోనేచెప్పబడతాయి. ఎందుకంటే రాజ్యాంగం అనే వృక్షానికిన్యాయవ్యవస్థ  కొమ్మమతంరాజ్యాంగం రెండు మనిషి సృష్టే.కానీ మతం అంటే ఆధ్యాత్మికత  ఆధ్యాత్మికత కొన్ని వేలసంవత్సరాల నుంచి వుంది.  మనదేశంలో అనేక మతాలుఉన్నాయి ఐనా మనది ప్రజస్వామ్యం దేశం. అందుకనే మతంకుడా రాజ్యాగం పరిధిలో రాజ్యాగానికి లోబడి ఉండాల్సిందే.అందుకే శబరిమల కేసు తీర్పు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగపరిధిలో తీర్పు చెప్పడం జరిగుతోందని సుప్రీమ్ కోర్ట్ పదే పదేచెప్తోంది. మతం మనోభావాలు దెబ్బ తినకుండ  మనుషులమధ్య అంతరాలు పెరగకుండా రాజ్యాంగం కాపు కాస్తుందిమనరాజ్యాంగం  మేర హామినిస్తోంది.

న్యాయవ్యవస్థ శబరిమల కేసు విషయంలో మరింత లోతైనపరిశోధన జరిపివుండాల్సిందేమో?  శబరిమల లో నియమము స్త్రీవివక్షేనా? స్త్రీ వివక్ష అంటే జెండర్ డిస్క్రిమినేషన్. స్త్రీ వి కాబట్టిఆలయ ప్రవేశానికి అనర్హురాలివి అనేదే నియమం ఐతే నిజంగానేమనం వ్యతిరేకించాల్సిందే. కానీ కొన్ని వయసులవారికి నిషేధంలేద  8 నుంచి 50 లోపు వారికి నిషేధంఒకేవేళ నిజాంగా స్త్రీవివక్ష ఐతే మొత్తం స్త్రీ జాతిని నిషేధించాలి కానీ కొన్నివయసులవారికి అనుమతి ఉండటంతో ఇది స్త్రీ వివక్ష లాకనిపించదు. ఏఆచారానిఏసంప్రదాయాన్ని కొనసాగించాలి లేదానిలిపివేయాలి అని తేల్చమని కోర్ట్ ముందువుంచితే అది కోర్టుకికత్తిమీద సామే. పూర్తిగా హేతువాద దృష్టితో చూస్తే అసలుదేవుడి ఉనికికే ప్రమాదం ఏర్పాడుతుంది. సున్నితమైనఅంశాలని అవి ప్రమాదభరితంగామూఢంగా లేనపుడు వాటినికదిలించకుండా ఉంటే ఉత్తమం.        

2, నవంబర్ 2016, బుధవారం

 (నన్నెద్దేవచేసారే)

మళ్ళీ అయ్యప్ప దీక్షలు ప్రారంభం.
ఎంత భక్తి ఎంత నిష్ట. ఎన్ని నియమాలు.
ఎట్లా పడితేఅట్లా వండింది తినకూడదు.
వీలైతే వండుకొనే తినాలి.
బహిష్టు స్త్రీని చూడకూడదు.
భార్య కి దూరంగా ఉండాలి.
శవాన్ని చూడకూడదు.
మాంసం తినకూడదు.
మందు తాగకూడదు.
ఉల్లివెల్లుల్లి తినకూడదు.
తెల్లవారుఝామున లేవాలి.
రెండు పూట్ల తల స్నానం చేయాలి.
రెండు పూట్ల నియమంగా పూజచేయాలి.

అరె మరిదేంటి నేను ఎక్కడ పడితే అక్కడ తిననంటే మనుషుల మధ్య అంతరాలు చూపిస్తున్నావ్ అన్నారే..అసలు నీ వల్లే ఈ అంతరాలు అన్నారే..
అరె... స్త్రీని అణగతొక్కావ్ అని వేలసంవత్సరాల నాటి మనుస్మృతి తీసి నానాయాగీ చేసారే..
అరె...నీకు మాంసం తినే దమ్ము లేదు ఉత్త పప్పు గాడివన్నారే
అరె...మందు కొట్టలేని అర్భకుడివన్నారే నన్ను,
రెండు పూట్ల స్నానాన్ని రెండు పూట్ల పూజని ఎద్దేవ చేసారే..నా మడిబట్టని లాక్కెళ్ళారే...
ఇప్పుడు దాన్నే(నల్ల డ్రస్) కట్టుకొని నెల రోజులు పవిత్రంగా ఉంటానంటున్నారే...
                              (నన్నెద్దేవచేసినోళ్ళకి)






24, డిసెంబర్ 2015, గురువారం

దేవుడు, పవిత్ర గ్రంథం, నిజమెంత?

దేవుడు ఎక్కడ,ఎలా వుంటాడు! ఏ దేవుడు గొప్ప ,ఏ మతం,ఏ మత గ్రంధం గొప్ప ?
అసలు దేవుడి పేరుమీద జరిగినన్ని యుద్దాలు,హత్యలు,నానాగొడవ ఈ ప్రపంచంలొ మరేవిషయం మీదా జరగలెదనుకుంటా. వేలసంవత్సరాల క్రితం రాసిన గ్రంథాలే దేవుడికి సమాదానమా.నాకెందుకో ఒకోసారి  మూర్ఖంగా వాటిని పట్టుకొని వేళ్ళాడు తున్నామా అనిపిస్తుంది. అన్నీ ఆఆ అవతారాలు పూర్తయ్ న కొన్ని  సంవత్సరాల తరువాత రాసినవే. వేదాల విషయంలో కొన్ని విని చెప్పినవంటారు.ఒక వేళ నిజమనుకున్నా వందల సంవత్సరాలు అదీ హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగిన పరాయి పాలనలో  మగ్గిన తరువాత వేదాల్లో నిజమెంత అబద్దమెంత స్వార్థమెంత జొప్పించినదెంతో తెలియని పరిస్థితి. మనిషే వ్రాసిన ఈపవిత్ర గ్రంథాలపై అనేక విమర్శలున్నాయ్. దానికి తోడు మా గ్రంథం గొప్పదని చెప్పుకొనే క్రమంలో ఇతర మత గ్రంథాలని విమర్శిస్తూ బొచ్చడు పుస్తకాలు, బ్లాగులు రెడీగా ఉన్నాయ్. ఆత్మవిమర్శ కంటే పక్కవాణ్ని విమర్శించడమే బాగా టేస్టీగా ఉంటుంది కదా. నా ఉద్దేశం ఏ గ్రంథమైనా సరే వాటి నుంచి కాలం చెల్లిన విషయాలు పక్కన పెట్టి మంచిని,  అందరికి అంగీకారంమైన విషయాలు తీసుకునే అవగాహన రావాలి.నాకు తెలిసినంతలో అన్నీ మత గ్రంథాలు దేవుడు రూపరహితుడు,సర్వాంతర్యామి అని చెప్తున్నాయి. అసలు దేవుడి కి మతమేంటో రాజకీయపార్టీల్లాగ. ఒక వేళ దేవుడే కనక ఫలానా మతం లోకి వస్తేనే లేదా ఫలానా కానుకలు సమర్పిస్తేనే లేదా ఫలానా పూజలు చేస్తేనే కరుణిస్తానంటే వాడు దేవుడేలా అవుతాడు.