భారత రాజ్యాగం స్త్రీ ని పురుషుడిని ఒకేలా చూస్తుంది అంటేఇద్దరిని ఒకే జండర్ గ చూస్తుంది. అంటే ఇద్దరిని సెపెరేట్ఈక్వల్ ఇండివిడ్యుయల్స్ గా పరిగణిస్తుంది.
మన రాజ్యాగం మతాన్ని, కులాన్ని, ఆచారాల్ని ప్రామాణికం గాతీసుకోని రాయబడలేదు. రాజ్యాగం ప్రతి విషయాన్నీశాస్త్రీయంగా,హేతుబద్దంగా,ఆచరణాత్మగంగానే చూస్తుందిఅలానే మన రాజ్యాంగ కర్తలు రాజ్యాంగాన్ని రాశారు.
కోర్ట్ తీర్పులు కుడా రాజ్యాంగ బద్ధం గా రాజ్యంగ పరిధి లోనేచెప్పబడతాయి. ఎందుకంటే రాజ్యాంగం అనే వృక్షానికిన్యాయవ్యవస్థ ఓ కొమ్మ. మతం, రాజ్యాంగం రెండు మనిషి సృష్టే.కానీ మతం అంటే ఆధ్యాత్మికత ఈ ఆధ్యాత్మికత కొన్ని వేలసంవత్సరాల నుంచి వుంది. మనదేశంలో అనేక మతాలుఉన్నాయి ఐనా మనది ప్రజస్వామ్యం దేశం. అందుకనే మతంకుడా రాజ్యాగం పరిధిలో రాజ్యాగానికి లోబడి ఉండాల్సిందే.అందుకే శబరిమల కేసు తీర్పు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగపరిధిలో తీర్పు చెప్పడం జరిగుతోందని సుప్రీమ్ కోర్ట్ పదే పదేచెప్తోంది. మతం మనోభావాలు దెబ్బ తినకుండా మనుషులమధ్య అంతరాలు పెరగకుండా రాజ్యాంగం కాపు కాస్తుంది. మనరాజ్యాంగం ఆ మేర హామినిస్తోంది.
న్యాయవ్యవస్థ శబరిమల కేసు విషయంలో మరింత లోతైనపరిశోధన జరిపివుండాల్సిందేమో? శబరిమల లో నియమము స్త్రీవివక్షేనా? స్త్రీ వివక్ష అంటే జెండర్ డిస్క్రిమినేషన్. స్త్రీ వి కాబట్టిఆలయ ప్రవేశానికి అనర్హురాలివి అనేదే నియమం ఐతే నిజంగానేమనం వ్యతిరేకించాల్సిందే. కానీ కొన్ని వయసులవారికి నిషేధంలేదు 8 నుంచి 50 లోపు వారికి నిషేధం. ఒకేవేళ నిజాంగా స్త్రీవివక్ష ఐతే మొత్తం స్త్రీ జాతిని నిషేధించాలి కానీ కొన్నివయసులవారికి అనుమతి ఉండటంతో ఇది స్త్రీ వివక్ష లాకనిపించదు. ఏఆచారాని, ఏసంప్రదాయాన్ని కొనసాగించాలి లేదానిలిపివేయాలి అని తేల్చమని కోర్ట్ ముందువుంచితే అది కోర్టుకికత్తిమీద సామే. పూర్తిగా హేతువాద దృష్టితో చూస్తే అసలుదేవుడి ఉనికికే ప్రమాదం ఏర్పాడుతుంది. సున్నితమైనఅంశాలని అవి ప్రమాదభరితంగా, మూఢంగా లేనపుడు వాటినికదిలించకుండా ఉంటే ఉత్తమం.